19 October 2018

ZIO MEDIA CABLE

🛑 జియో మీడియా కేబుల్ వచ్చేస్తోంది, ఇక కేబుల్ కనెక్షన్‌తో పని ఉండదు!
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

జియో ఫోన్‌లను టీవీలకు కనెక్ట్ చేసకుని లైవ్ ఛానళ్లను వీక్షించేందుకు వీలుగా సరికొత్త కేబుల్‌ను జియో అందుబాటులోకి తీసుకురాబోతోంది. జియో మీడియా కేబుల్ పేరిట ఈ కొత్త ప్రోడక్ట్‌ అందుబాటులో ఉంటుంది. ఈ కేబుల్‌ సహాయంతో జియో ఫోన్ అలానే జియో ఫోన్ 2 యూజర్లు పాత CRT టీవీలకు సైతం తమ ఫోన్‌లను కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.
🛑 కేబుల్ ధర రూ.1,499.
ఈ వివరాలను జియో అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయవల్సి ఉంది. మార్కెట్లో ఈ కేబుల్ ధర రూ.1,499 వరకు ఉండొచ్చని తెలుస్తోంది ఈ కేబుల్ లాంచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రివీల్ అయ్యే అవకాశం ఉంది. జియో మీడియా కేబుల్‌ను ఉపయోగించుకోవటం ద్వారా జియో ఫోన్ యజమానులు జియోటీటవీ అలానే జియోసినిమా యాప్స్ ఆఫర్ చేసే కంటెంట్‌ను తమతమ టీవీలలో స్ట్రీమ్ చేసుకునే వీలుంటుంది
🛑 అన్ని రకాల టీవీలను సపోర్ట్ చేస్తుంది..
స్మార్ట్‌టీవీల దగ్గర నుంచి సీఆర్‌టీ టీవీల వరకు అన్ని రకాల టీవీలను ఈ కేబుల్ సపోర్ట్ చేస్తుంది. జియో తన టీవీ యాప్ ద్వారా 600 టీవీ ఛానల్స్‌ను జియో యూజర్లకు అందిస్తోన్న విషయం తెలిసిందే. డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు నెలనెలా బిల్లులను చెల్లించే బదులు జియో ఫోన్ యూజర్లు జియో మీడియా కేబుల్ సహాయంతో తక్కువ ఖర్చుతో లైవ్ టీవీ ఛానల్స్‌తో పాటు సినిమాలను వీక్షించే వీలుంటుంది.
🛑 గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదరణ లభించే అవకాశం..
బెస్ట్ సెల్లింగ్ ఫీచర్ ఫోన్‌గా అవతరించిన జియోఫోన్‌ను సెమీ అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువుగా ఉపయోగించుకంటున్నారు. దీంతో ఈ జియో మీడియా కేబుల్ కాన్సెప్ట్ బాగా వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. జియో మీడియా కేబుల్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
🛑 రెండు రకాల వేరియంట్స్...
మొదటి వేరియంట్ వచ్చేసరికి బ్లూ కలర్ ప్యాకేజింగ్‌తోనూ, రెండవ కలర్ వేరియంట్ వచ్చేసరికి రెడ్ కలర్ ప్యాకేజింగ్‌తోనూ అందుబాటులో ఉంటాయి. బ్లు కలర్ ప్యాకేజింగ్‌తో వచ్చే కేబుల్‌ను CRT టీవీలకు కనెక్ట్ చేసుకునే విధంగా RCA కనెక్టర్ సదుపాయాన్ని జియో కల్పించింది. ఇక రెడ్ కలర్ ప్యాకేజింగ్‌తో వచ్చే కేబుల్‌ను ఎల్‌సీడీ టీవీలకు కనెక్ట్ చేసుకునే విధంగా HDMI పోర్ట్ సదుపాయాన్ని కల్పించారు.                                                                                   ⚫⚫⚫🌏🅰🅿🌏⚫⚫⚫

9 comments: